Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీ మెట్రోలో అందరూ చూస్తుండగా యువకుడి అసభ్యకరమైన పని.. తీవ్రంగా స్పందించిన మహిళా కమిషన్

man booked over viral video of masturbating on Delhi Metro
Advertisement
  • కఠిన చర్యలు తీసుకోవాలంటూ నోటీసుల జారీ 
  • ప్రయాణికులు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కోరిన ఢిల్లీ మెట్రో
  • కేసు నమోదు చేసిన పోలీసులు
Advertisement
ఢిల్లీ మెట్రో.. ఎన్నో పిచ్చి పనులకు చిరునామా అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అదొక ప్రజా రవాణా సాధనం అన్న విషయాన్ని మర్చిపోయి ఎవరికి నచ్చినట్టు వారు వ్యవహరించడం, ప్రవర్తించడాన్ని చూడొచ్చు. తాజాగా ఢిల్లీ మెట్రోలో ఓ యువకుడు చుట్టూ ప్రయాణికులు ఉండగా, వారి సమక్షంలోనే అసభ్యకరమైన పనికి పాల్పడ్డాడు. చేతితో అతడు చేస్తున్న అసహ్యకరమైన పనిని చూడలేక అక్కడున్న వారు సిగ్గుతో పక్క పెట్టెల్లోకి పరారయ్యారు. 

దీన్ని ఓ వ్యక్తి వీడియో తీసి షేర్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లోకి చేరి సంచలనంగా మారింది. ఢిల్లీ మహిళా కమిషన్ దీన్ని తీవ్రంగా పరిగణించింది. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ మెట్రో, పోలీసులకు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలైవాల్ నోటీసులు జారీ చేశారు. ‘‘ఢిల్లీ మెట్రోలో ఓ వ్యక్తి సిగ్గు లేకుండా మాస్టర్ బేటింగ్ చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది పూర్తిగా అసహ్యకరమైనది. అనారోగ్యకరమైనది. ఈ చర్యపై వీలైనంత వరకు కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులు, మెట్రో అధికారులకు నోటీసులు జారీ చేశాను’’ అని స్వాతి మలైవాల్ ట్వీట్ చేశారు.  

ఢిల్లీ మెట్రో కూడా స్పందించింది. ‘‘మెట్రోలో ప్రయాణించే సమయంలో బాధ్యతాయుతంగా నడుచుకోవాలని అభ్యర్థిస్తున్నాం. ఎవరైనా అసభ్యకరమైన ప్రవర్తనను గుర్తిస్తే వెంటనే దాన్ని డీఎంఆర్సీ హెల్ప్ లైన్ కు కాల్ చేసి తెలియజేయండి’’ అంటూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కూడా ట్వీట్ చేసింది. పోలీసులు సైతం సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదులు పెట్టారు. 

ఇక ఢిల్లీ మెట్రో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. మహిళల మాదిరిగా స్కర్ట్ లు ధరించి పురుషులు మెట్రోల్లో ప్రయాణించడం, బెత్తెడంత వస్త్రాన్ని నడుము దగ్గర ధరించి యువతులు ప్రయాణించడం, మెట్రోల్లో పూనకం వచ్చినట్టు డ్యాన్స్ చేస్తూ వీడియోలు విడుదల చేయడం.. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే ఉన్నాయి.
Advertisement
Advertisement
man
masturbating
delhi metro
women commission
reacts
police case

More Telugu News